హైదరాబాద్: 28°C
వార్తలు

SIR ప్రక్రియలో అక్రమాలు: బీజేపీ

HYD: హైదరాబాద్‌లోని నాలుగు పార్లమెంట్ నియోజకవర్గాల్లో SIR ప్రక్రియలో అక్రమాలు జరుగుతున్నాయని ఆరోపిస్తూ బీజేపీ ప్రతినిధి బృందం రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారికి ఫిర్యాదు చేసింది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రాంచందర్ రావు నేతృత్వంలో నివేదిక సమర్పించారు. హైదరాబాద్, సికింద్రాబాద్, మల్కాజిగిరి, చేవెళ్ల ప్రాంతాల్లో ఓట్ల నమోదును అడ్డుకుంటున్నారని ఆరోపించారు. దీనిపై సమగ్ర విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని కోరారు.