హైదరాబాద్: 28°C
వార్తలు

'ఇసుక అక్రమ రవాణాను అరికట్టాలి'

PPM: ఇసుక అక్రమ రవాణాను అరికట్టి, అక్రమాలకు పాల్పడుతున్న వారిపై, అడ్డుకోలేని అధికారులపై చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ పార్టీ నాయకులు కోరారు. సోమవారం కలెక్టరేట్‌లో జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో డీఆర్వో హేమలతకు వినతిపత్రం అందజేశారు. నాగావళి, వంశధార, సువర్ణముఖి, వేగావతి తదితర నదుల్లో అక్రమ రవాణా జరుగుతుందన్నారు.