MNCL: లక్షెట్టిపేట మున్సిపాలిటీ పరిధిలోని గంపలపల్లికి చెందిన రామ్ దేని రాకేష్ (25) ఆసుపత్రిలో చికిత్స పొందుతూ సోమవారం మృతి చెందాడు. గత ఏడాది రాకేష్‌కు కావ్యతో వివాహం జరిగింది. భార్యాభర్తల మధ్య చిన్న వివాదం చోటుచేసుకోవడంతో కావ్య పుట్టింటికి వెళ్లినట్లు సమాచారం. మనస్తాపానికి గురైన రాకేష్ ఇంట్లో ఉన్న గడ్డి మందు తాగి ఆత్మహత్యాయత్నం చేయగా, కరీంనగర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందాడు
వార్తలు
మనస్తాపంతో యువకుడి ఆత్మహత్య


