హైదరాబాద్: 28°C
వార్తలు

విద్యుత్ శాఖ అధికారికి సర్పంచ్ వినతి

BHPL: గోరికొత్తపల్లి మండలం నిజాంపల్లి గ్రామంలో నెలకొన్న విద్యుత్ సమస్యల పరిష్కారానికి గ్రామ సర్పంచ్ సునీత-రవీందర్, ఉపసర్పంచ్ రాజేశ్వరరావు ఇవాళ BHPL విద్యుత్ శాఖ అధికారిని కలిసి వినతిపత్రం అందజేశారు. గ్రామానికి ప్రత్యేకంగా సింగిల్ ఫేజ్ విద్యుత్ లైన్ ఏర్పాటు చేయాలని కోరారు. సమస్యను పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటామని ఆయన హామీ ఇచ్చినట్లు సర్పంచ్ తెలిపారు.