హైదరాబాద్: 28°C
వార్తలు

బీజేవైఎం జిల్లా అధ్యక్షుల నియామకం

ADB: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావు సూచనల మేరకు భారతీయ జనతా యువ మోర్చా (బీజేవైఎం) రాష్ట్ర అధ్యక్షుడు గణేశ్ తెలంగాణలోని పలు జిల్లాలకు యువ మోర్చా అధ్యక్షులను నియమించారు. ఆదిలాబాద్ జిల్లా అధ్యక్షుడిగా సాయి కృష్ణ, మంచిర్యాల జిల్లా అధ్యక్షుడిగా శివకృష్ణ, నిర్మల్ జిల్లా అధ్యక్షుడిగా నిరంజన్ రెడ్డిని నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.