హైదరాబాద్: 28°C
వార్తలు

వైభవంగా శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి పార్వేట ఉత్సవం

TPT: శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి పార్వేట ఉత్సవం సోమవారం శ్రీవారిమెట్టు సమీపంలో భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఉత్సవమూర్తులను ఊరేగింపుగా పార్వేట మండపానికి తీసుకెళ్లి పార్వేట ఉత్సవం, ఆస్థానం నిర్వహించారు. టీటీడీ అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులు సంకీర్తనలు ఆలపించగా, భజన బృందాలు భక్తులను అలరించాయి. అనంతరం భక్తులకు అన్నప్రసాదాలు పంపిణీ చేశారు.