NLG: చిట్యాల పురపాలిక పరిధిలో వరుసగా మూడు వ్యవసాయ బావుల వద్ద ఇన్వెల్ పంపుసెట్ల విద్యుత్ వైర్లను దొంగలు ఎత్తుకెళ్లారు. బాధితులైన రైతులు పెద్దగోని ముత్యాలు, కంబాలపల్లి కలమ్మ, జడల మహేష్ సోమవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. 'ఎల్ నినో' ప్రభావంతో వర్షాలు లేక ఆందోళనలో ఉన్న తమకు, దొంగతనాల రూపంలో మూలిగే నక్కపై తాటిపండు పడినట్లయిందని రైతులు వాపోయారు.
వార్తలు
VIDEO: బావుల వద్ద మోటార్ల విద్యుత్త్ వైర్లు చోరీ


