హైదరాబాద్: 28°C
వార్తలు

130 ఫిర్యాదులు స్వీకరించిన ఎస్పీ పి.జగదీష్

ATP: అనంతపురం జిల్లా పోలీస్ కాన్ఫరెన్స్ హాల్‌లో సోమవారం నిర్వహించిన పీజీఆర్‌ఎస్ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ పి.జగదీష్ స్వయంగా పాల్గొని బాధితుల నుంచి 130 పిటీషన్లు స్వీకరించారు. సమస్యల తీవ్రతను బట్టి క్షేత్రస్థాయి అధికారులతో ఫోన్లో మాట్లాడి తక్షణ ఆదేశాలు జారీ చేశారు. నిర్ణీత గడువులోగా విచారణ జరిపి బాధితులకు న్యాయం చేయాలని స్పష్టం చేశారు.