హైదరాబాద్: 28°C
వార్తలు

విద్యార్థులకు నగదు ప్రోత్సాహకాలు అందజేత

సత్యసాయి: పుట్టపర్తి జగరాజుపల్లిలో సోమవారం షైనింగ్ స్టార్స్ అవార్డ్స్-2026 కార్యక్రమం ఘనంగా జరిగింది. టెన్త్, ఇంటర్ పరీక్షల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన 237 మంది విద్యార్థులకు మంత్రి సవిత, ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి, కలెక్టర్ శ్యాంప్రసాద్ రూ. 47.40 లక్షల నగదు ప్రోత్సాహకాలు, అవార్డులు పంపిణీ చేశారు. చదువుతోనే ఉజ్వల భవిష్యత్తు సాధ్యమని తెలిపారు.