హైదరాబాద్: 28°C
వార్తలు

22ఏ జాబితా రైతులకు శాపం: ఏబీ వెంకటేశ్వరరావు

AP: నిషేధిత భూముల 22A జాబితాపై మాజీ IPS అధికారి ఏబీ వెంకటేశ్వరరావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. 'నా సొంత భూమిని 22A జాబితాలో ఎలా చేరుస్తారు?' అని ఆయన ప్రశ్నించారు. ఈ నిబంధన వల్ల రాష్ట్రంలో లక్షల ఎకరాలు చిక్కుకుపోయాయని, ఇది రైతులకు శాపంగా మారిందని మండిపడ్డారు. తప్పులు లేకపోయినా రైతులు ఎందుకు బలికావాలని ప్రశ్నించిన ఆయన, ఈ సమస్య పరిష్కారమయ్యే వరకు పోరాటం ఆపనని స్పష్టం చేశారు.