హైదరాబాద్: 28°C
వార్తలు

క్షతగాత్రునికి 15,000 రూ. ఆర్థిక సహాయం

SKLM: నందిగాంకు చెందిన సకలభక్తుల రంజిత్ రోడ్డు ప్రమాదంలో కాలు కోల్పోయి ఇబ్బంది పడుతున్నాడు. ఈ విషయం తెలుసుకున్న టెక్కలి అభయం యువజన సేవా సంఘం సోమవారం అతని భార్య స్వాతికి మందుల ఖర్చు కోసం 15,000 రూపాయలు అందజేసింది. ఈ కార్యక్రమంలో సంఘం అధ్యక్షులు దేవాది శ్రీనివాస రావు, సెక్రెటరీ లాడె కామేశ్వర రావు, సంఘ సభ్యులు పాల్గొన్నారు.