హైదరాబాద్: 28°C
వార్తలు

గడువులోనే పనులు పూర్తి.. జాప్యానికి తావులేదు: నిమ్మల

AP: పాలకొల్లులో కోట్లాది రూపాయలతో జరుగుతున్న వివిధ అభివృద్ధి పనులను నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాలని మంత్రి నిమ్మల రామానాయుడు అధికారులను ఆదేశించారు. క్యాంపు కార్యాలయంలో జరిగిన సమీక్షలో.. అంబేడ్కర్ భవనం, షాదీఖానా, ఆసుపత్రి సుందరీకరణ తదితర పనుల పురోగతిని పరిశీలించారు. పనుల నాణ్యతలో రాజీ పడొద్దని, జాప్యం జరిగితే అధికారులు, కాంట్రాక్టర్లపై చర్యలు ఉంటాయని మంత్రి హెచ్చరించారు.