హైదరాబాద్: 28°C
వార్తలు

ఆధార్ సేవలు అందుబాటులో: MEO

SRCL: రుద్రంగి మండలం మానాల ప్రభుత్వ పాఠశాలలో ఆధార్ సేవలు మరింత చేరువయ్యాయి. స్థానికంగా ఆధార్ నమోదు, సవరణ సేవలను ఎంఈవో రామకృష్ణ ప్రారంభించారు. ఆధార్ వివరాల మార్పులు, కొత్త నమోదు, 5-15 ఏళ్ల పిల్లలకు తప్పనిసరి బయోమెట్రిక్ అప్‌డేట్ సేవలు అందుబాటులో ఉంటాయని తెలిపారు. చిరునామా, జన్మతేది, మొబైల్ నంబర్ వంటి వివరాల సవరణలు కూడా ఇక్కడే చేసుకోవచ్చని పేర్కొన్నారు.