హైదరాబాద్: 28°C
వార్తలు

'గ్రామాల సమగ్ర అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉంది'

WGL: దుగ్గొండి మండలం రేకంపల్లి గ్రామంలో రూ. 20 లక్షలతో గ్రామపంచాయతీ భవనం, రూ.10 లక్షలతో మహిళా సంఘ భవన నిర్మాణ పనులకు నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్రామాల సమగ్ర అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. మహిళలను ఆర్థికంగా బలోపేతం చేయడమే ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు.