హైదరాబాద్: 28°C
వార్తలు

జీవో 396ను రద్దు చేయాలని నిరసన

సత్యసాయి: రిజిస్ట్రార్ కార్యాలయాల వద్ద దస్తావేజు లేఖర్ల వ్యవస్థను నిర్వీర్యం చేసేలా తెచ్చిన జీవో 396ను రద్దు చేయాలని బుక్కపట్నం సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం వద్ద నిరసన తెలిపారు. ఈ జీవో వల్ల తాతల కాలం నాటి ఉపాధి దెబ్బతిని, వేలాది కుటుంబాలు రోడ్డున పడతాయని ఆవేదన వ్యక్తం చేశారు. అనంతరం జీవోను వెనక్కు తీసుకోవాలని అధికారులకు వినతిపత్రం ఇచ్చారు.