హైదరాబాద్: 28°C
వార్తలు

చార్‌ధామ్ యాత్ర తాత్కాలికంగా నిలిపివేత

ఉత్తరాఖండ్ ప్రభుత్వం చార్‌ధామ్ యాత్రను తాత్కాలికంగా నిలిపివేసింది. ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంది. హిమాలయ పుణ్యక్షేత్రాలకు వెళ్లే మార్గాల్లో పలుచోట్ల కొండచరియలు విరిగిపడటంతో ముందుజాగ్రత్త చర్యలు చేపట్టింది. పరిస్థితులు సాధారణ స్థితికి వచ్చిన తర్వాతే యాత్రను తిరిగి ప్రారంభిస్తామని అధికారులు తెలిపారు.