హైదరాబాద్: 28°C
వార్తలు

యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలి: SI

VZM: జిల్లాలోని కురుపాం (M) నీలకంఠాపురం గ్రామంలో మాదకద్రవ్యాల నిర్మూలన, రోడ్డు భద్రతపై ఎస్‌ఐ రమేష్ నాయుడు ప్రజలకు అవగాహన కల్పించారు. మాదకద్రవ్యాల వినియోగం వల్ల కలిగే దుష్పరిణామాలు గురించి వివరించారు. యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని, ఏదైనా అనుమానంగా ఉంటే, పోలీసులకు సమాచారం అందించాలని, వివరాలు గోప్యంగా ఉంచుతామని చెప్పారు.