హైదరాబాద్: 28°C
వార్తలు

టికెట్ల ద్వారా రూ:19 లక్షలు ఆదాయం

CTR: బోయకొండ గంగమ్మ ఆలయం వద్ద వివిధ సేవా టికెట్ల విక్రయాల ద్వారా రూ.19 లక్షలు ఆదాయం సమకూరినట్లు ఆలయ ఉప కమిషనర్ ఏకాంబరం వెల్లడించారు. ఆదివారం ఒక్కరోజు మాత్రమే ఆలయం వద్ద నిర్వహించిన సేవా టికెట్ల ద్వారా ఆదాయం సమకూరిందన్నారు. ఆషాఢ మాసంలో భక్తుల రద్దీ దృష్టిలో ఉంచుకొని ప్రత్యేక చర్యలు ఏర్పాట్లు చేయాలని సిబ్బందికి ఆదేశాలు జారీ చేస్తామన్నారు.