హైదరాబాద్: 28°C
వార్తలు

రాత్రి వేళల్లో నగరంలో పోలీసు నిఘా

NLR: నగరంలో అసాంఘిక, చట్టవిరుద్ధ కార్యకలాపాల నియంత్రణకు ఎస్పీ డా. అజిత వేజెండ్ల ఆదేశాల మేరకు ప్రత్యేక ఎస్‌టీఎఫ్ బృందాలతో రాత్రి వేళల్లో కట్టుదిట్టమైన నిఘా కొనసాగుతోంది. డ్రంక్ అండ్ డ్రైవ్, ఓపెన్ డ్రింకింగ్, వాహనాలు, లాడ్జీలు, గెస్ట్ హౌస్‌లపై విస్తృత తనిఖీలు నిర్వహిస్తున్నారు. అనుమానాస్పద వ్యక్తులపై ప్రత్యేక నిఘా ఉంచి అవసరమైన చర్యలు తీసుకుంటున్నారు.