హైదరాబాద్: 28°C
వార్తలు

పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభం

పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభమయ్యాయి. అయోధ్య అంశం, నీట్ పేపర్ లీక్‌పై చర్చకు విపక్షాలు డిమాండ్ చేశాయి. ఈ మేరకు లోక్‌సభలో విపక్షాలు నిరసన చేపట్టాయి. సభ్యులు సభా మర్యాదలు పాటించాలని స్పీకర్ ఓంబిర్లా సూచించారు. క్వశ్చన్ అవర్ సమయంలో నినాదాలు మంచిది కాదన్నారు. విపక్షాల ఆందోళనతో లోక్‌సభ 12 గంటల వరకు వాయిదా పడింది.