హైదరాబాద్: 28°C
వార్తలు

ముంబైలో దంచికొడుతున్న వర్షం

మహారాష్ట్ర రాజధాని ముంబైలో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురుస్తోంది. ముఖ్యంగా వర్లీ ప్రాంతంలో కురిసిన భారీ వర్షానికి సంబంధించిన దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. వర్షపు ధాటికి నగరంలోని పలు ప్రధాన రోడ్లు పూర్తిగా జలమయం కావడంతో వాహనదారులు, స్థానికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రద్దీ ప్రాంతాల్లో ట్రాఫిక్ స్తంభించిపోవడంతో ప్రయాణం ఇబ్బందిగా మారింది.