హైదరాబాద్: 28°C
వార్తలు

మాట నిలబెట్టుకున్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్

ASR: అనంతగిరి మండలంలోని పర్యటనలో భాగంగా గిరి పుత్రులకు ఇచ్చిన మాట డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నిలబెట్టుకున్నారు. కోటి రూపాయల విలువైన పలు అభివృద్ధి పనులు పూర్తి చేశారు. బల్లగరువు, వెలగపాడు, కోరపర్తిలో అంగన్వాడీ భవనాలు, తాగునీరు, సీసీ రోడ్లు, పాఠశాల భవన మరమ్మతులు, ప్రహరీ తదితర వసతులను డిప్యూటీ సీఎం చొరవతో అందుబాటులోకి వచ్చాయి.