హైదరాబాద్: 28°C
వార్తలు

VIDEO: పిచ్చి మొక్కల నిర్మూలనకు మందు పిచికారి

SRD: కొండాపూర్ మండలంలోని గొల్లపల్లి గ్రామంలో పలు వీధుల్లో ఖాళీ స్థలాల్లో కొద్దిపాటి వర్షానికి చాలా పిచ్చి మొక్కలు పెరిగాయి. చీడపీడ పురుగులు, దోమ, విషపూరిత పాములు గృహాల్లోకి ప్రవేశిస్తున్నాయని స్థానిక ప్రజలు పాలక సభ్యులకు తెలియజేశారు. దీంతో సర్పంచ్ శ్రీనివాస్, ఈ పిచ్చి మొక్కల తొలగింపుకు గడ్డి మందు పిచికారి చేయగా స్థానిక ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.