SDPT: గజ్వేల్ మున్సిపాలిటీలో రెగ్యులర్ ఏఈ లేకపోవడంతో పలు అభివృద్ధి పనులు ఆలస్యమవుతున్నాయి. ప్రస్తుతం ఇన్‌చార్జ్ ఏఈ వారంలో రెండు రోజులు మాత్రమే విధులు నిర్వహిస్తుండటంతో ఫైళ్లు పెండింగ్‌లో పడుతున్నాయి. అమృత్ 2.0, యూడీఎఫ్, చిల్డ్రన్స్ పార్కు పనులు మందగించగా, పూర్తి స్థాయి ఏఈని వెంటనే నియమించాలని ప్రజలు కోరుతున్నారు.
వార్తలు
ఏఈ లేక అభివృద్ధి పనులకు ఆటంకం


