హైదరాబాద్: 28°C
వార్తలు

దివ్యాంగుడిపై దాడి.. కఠిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి

బాపట్ల: జిల్లా చందోలులో దివ్యాంగుడు నాగమల్లేశ్వరరావు, ఆయన భార్యపై దాడి జరిగిన ఘటనను వైసీపీ దివ్యాంగుల విభాగం జిల్లా అధ్యక్షుడు రామయ్య ఖండించారు. ఆసుపత్రిలో బాధితులను పరామర్శించారు. దాడికి పాల్పడిన వారిపై దివ్యాంగుల హక్కుల చట్టం ప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరారు. బాధిత కుటుంబానికి రక్షణ కల్పించాలని విజ్ఞప్తి చేశారు.