హైదరాబాద్: 28°C
వార్తలు

బహదూర్‌గూడలో భూముల సేకరణ పూర్తి

TG: రంగారెడ్డి జిల్లాలోని బహదూర్‌గూడలో 650 ఎకరాల ప్రభుత్వ భూములకు కంచె పనులు పూర్తి అయ్యాయి. బుల్లెట్ రైలు, బస్సు టెర్మినల్ ప్రాజెక్టుల కోసం భూములను సర్కార్ స్వాధీనం చేసుకుంది. హైడ్రా ఆధ్వర్యంలో భారీ భద్రత మధ్య ఫెన్సింగ్ పూర్తి చేశారు. ఇప్పటికే సాగు చేస్తున్న రైతులకు పొలాల్లోకి వెళ్లేందుకు అనుమతి ఇచ్చింది. అయితే రైతుల దీక్షా శిబిరాన్ని అధికారులు తొలగించారు.