హైదరాబాద్: 28°C
వార్తలు

హామీ ఇస్తే దీక్ష విరమిస్తా: వాంగ్‌చుక్

దీక్ష విరమణపై పర్యావరణ ఉద్యమకారుడు సోనమ్ వాంగ్‌చుక్ ట్వీట్ చేశారు. పేపర్ లీకేజీలపై కేంద్రం బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. విద్యార్థుల సమస్యను పార్లమెంటులో లేవనెత్తుతామని రాజకీయ పార్టీలు తమకు హామీ ఇస్తే దీక్ష విరమిస్తానని వెల్లడించారు. ఎంపీలు ఆసుపత్రికి వచ్చి హామీ ఇవ్వాలని తెలిపారు. ఆసుపత్రిలో అక్రమ నిర్బంధంలో ఉన్నట్లు చెప్పారు. తన వాక్ స్వేచ్ఛపై ఆంక్షలు ఉన్నాయన్నారు.