హైదరాబాద్: 28°C
వార్తలు

నేడు విద్యుత్ సరఫరాలో అంతరాయం

జగిత్యాల పట్టణంలోని టౌన్-3 సెక్షన్ పరిధిలో రోడ్డు వెడల్పు పనులతో విద్యుత్ లైన్లను పక్కకు మార్చడం వల్ల సోమవారం ఉదయం 8.30 గంటల నుంచి మధ్యాహ్నం 1.30 గంటల వరకు కరెంట్ ఉండదని డీఈ కే.గంగారాం తెలిపారు. ఎస్పీ ఆఫీస్, హౌసింగ్ బోర్డు, రామాలయం, అంతర్గామ రోడ్, క్యాంప్ చర్చ్ ఏరియా, ధరూర్ క్యాంపు, మాత శిశు హాస్పిటల్, మెడికల్ కాలేజీ ఏరియాలో కరెంటు ఉండదన్నారు.