హైదరాబాద్: 28°C
వార్తలు

రేపు యథావిధిగా పీజీఆర్ఎస్: కలెక్టర్

W.G: భీమవరం కలెక్టరేట్‌తో పాటు జిల్లాలోని అన్ని మండల కార్యాలయాల్లో సోమవారం ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక యథావిధిగా నిర్వహించనున్నట్లు కలెక్టర్ చదలవాడ నాగరాణి తెలిపారు. ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 1:30 గంటల వరకు ప్రజలు అధికారులకు నేరుగా విన్నవించుకోవచ్చని పేర్కొన్నారు. దూర ప్రాంతాల వారు 1100 టోల్ ఫ్రీ నంబర్‌కు కాల్ చేయవచ్చన్నారు.