హైదరాబాద్: 28°C
వార్తలు

సింధు విజయం దేశానికి గర్వకారణం: ఎమ్మెల్యే

సత్యసాయి: జపాన్ ఓపెన్ 2026 టైటిల్‌ను కైవసం చేసుకున్న భారత బ్యాడ్మింటన్ స్టార్ పి.వి. సింధుకు ఎమ్మెల్యే పల్లె సింధూర అభినందనలు తెలిపారు. ఈ ఘనత సాధించిన మొట్టమొదటి భారతీయ క్రీడాకారిణిగా సింధు చరిత్ర సృష్టించడం దేశానికి గర్వకారణమన్నారు. ఆమె కృషి, పట్టుదల యువతకు స్ఫూర్తిదాయకమని కొనియాడారు. భవిష్యత్తులో ఆమె మరిన్ని అంతర్జాతీయ విజయాలు సాధించాలని ఆకాంక్షించారు.