హైదరాబాద్: 28°C
వార్తలు

ఇది చారిత్రాత్మ‌క విజ‌యం: మోదీ

జపాన్ ఓపెన్ 2026 బ్యాడ్మింటన్ టోర్నీలో చారిత్రాత్మక విజయం సాధించిన పి.వి. సింధుపై ప్రధాని నరేంద్ర మోదీ ప్రశంసలు కురిపించారు. టోర్నమెంట్‌లో ఆమె చూపిన పట్టుదల, అసాధారణ నైపుణ్యాలు అద్భుతమన్నారు. ఈ ప్రతిష్టాత్మక టైటిల్ గెలిచిన తొలి భారతీయురాలిగా సింధు రికార్డు సృష్టించిందని, ఈ విజయం దేశంలోని యువ క్రీడాకారులకు ఎంతో స్ఫూర్తినిస్తుందని మోదీ ఎక్స్‌లో కొనియాడారు.