ప్రకాశం: మార్కాపురం పట్టణంలోని భ్రమరా వెంచర్ వద్ద ఆదివారం ఇరు వర్గాల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. భ్రమరా వెంచర్‌కు చెందిన ఇద్దరు, స్థానికులలో ఇద్దరు గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చారు. గాయపడిన వారిని చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
వార్తలు
మార్కాపురంలో భ్రమరా వెంచర్ వద్ద ఘర్షణ


