హైదరాబాద్: 28°C
వార్తలు

డ్రగ్స్‌కు దూరంగా ఉండాలని పిలుపు

AKP: యువత మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలని పరవాడ సీఐ భాస్కరరావు పిలుపునిచ్చారు. ఆదివారం సాయంత్రం తిక్కవానిపాలెంలో యాంటీ డ్రగ్స్‌పై అవగాహన సదస్సు నిర్వహించారు. డ్రగ్స్‌కు అలవాటు పడితే జీవితం అంధకారమవుతుందని తెలిపారు. సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. గంజాయి విక్రయాలు, అక్రమ రవాణాపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.