MLG: పాలంపేటలోని ప్రపంచ వారసత్వ కట్టడం రామప్ప దేవాలయాన్ని ఏఎస్పీ సొయి శివైన్ ఐపీఎస్ ఆదివారం సందర్శించారు. ఆలయ అర్చకులు ప్రత్యేకపూజలు నిర్వహించి తీర్థప్రసాదాలు అందజేశారు. టూరిజం గైడ్ గోరంట్ల విజయ్‌కుమార్ ఆలయ చరిత్ర, శిల్పకళ విశిష్టతను వివరించారు. అనంతరం రామప్ప చెరువును సందర్శించి బోటింగ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఎస్సై చల్ల రాజు, టూరిస్ట్ పోలీసులు, వివిధశాఖల అధికారులున్నారు.
వార్తలు
రామప్పను సందర్శించిన ఐపీఎస్ అధికారి


