సత్యసాయి: లేపాక్షి మండలం మద్దిపి గ్రామంలో అసంపూర్తిగా ఉన్న డ్రైనేజీ వల్ల మురుగు నీరు నిలిచి దుర్గంధం వెదజల్లుతోందని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. దోమలు పెరిగి మలేరియా, డెంగ్యూ వ్యాధుల ముప్పు ఉందన్నారు. సప్పలమ్మ గుడి వీధిలో వీధి లైట్లు కూడా పనిచేయడం లేదని, డ్రైనేజీ పూర్తి చేసి లైట్లు మరమ్మతు చేయాలని అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలని కోరారు.
వార్తలు
అసంపూర్తి డ్రైనేజీతో ప్రజల ఇబ్బందులు


