హైదరాబాద్: 28°C
వార్తలు

కేజ్ వీల్స్‌తో రోడ్లపై ట్రాక్టర్లకు నో ఎంట్రీ: డీటీఓ

MHBD: జిల్లాలో కేజ్ వీల్స్ అమర్చిన ట్రాక్టర్లు ప్రజా రహదారులపై తిరిగితే వాహనాలను సీజ్ చేసి రూ.10 వేల జరిమానా విధిస్తామని MHBD జిల్లా డీటీఓ శంకర్ నాయక్ హెచ్చరించారు. కేజ్ వీల్స్‌ను వ్యవసాయ పొలాల్లో మాత్రమే వినియోగించాలని, రహదారులపై రబ్బరు టైర్లతోనే ప్రయాణించాలని సూచించారు. కేజ్ వీల్స్ వల్ల రోడ్లు దెబ్బతిని ప్రమాదాలు జరిగే అవకాశం ఉందన్నారు.