కర్ణాటకలో RTC బస్సులో కండక్టర్, మహిళా ప్రయాణికురాలు ఘోరంగా కొట్టుకున్నారు. బెలూరు-హాసన్ వెళ్తుండగా వీరి మధ్య చెలరేగిన చిన్న గొడవ పెద్దదై పరస్పర దాడికి దారితీసింది. కండక్టర్ ఆ మహిళను కింద పడేసి, జుట్టు పట్టుకుని కాలితో తొక్కగా, ఇతర ప్రయాణికులు కూడా కండక్టర్‌కు మద్దతుగా ఆమెపై దాడి చేశారు. గొడవకు కారణం తెలియాల్సి ఉండగా, పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
వార్తలు
ఘోరంగా కొట్టుకున్న కండక్టర్, ప్రయాణికురాలు


