హైదరాబాద్: 28°C
వార్తలు

పేకాట స్థావరంపై పోలీసుల దాడి

PLD: పల్నాడు జిల్లా చిలకలూరిపేట మండలం బొప్పూడి గ్రామ పరిధిలోని జాతీయ రహదారి (NH-16) సమీపంలోని పొలాల్లో కోతముక్క (పేకాట) ఆడుతున్న ఏడుగురిని చిలకలూరిపేట రూరల్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఎస్ఐ జి. అనిల్ కుమార్ ఆధ్వర్యంలో నిర్వహించిన దాడిలో రూ.13,200 నగదు, 52 పేకముక్కలను స్వాధీనం చేసుకుని నిందితులపై కేసు నమోదు చేశారు.