హైదరాబాద్: 28°C
వార్తలు

కుమ్మర సంఘం ఆధ్వర్యంలో ఘనంగా బోనాలు

BHNG: భువనగిరి పట్టణంలోని శ్రీ పోచమ్మ, మైసమ్మ దేవాలయాల్లో కుమ్మర సంఘం ఆధ్వర్యంలో బోనాల వేడుకలు భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. మున్సిపల్ ఛైర్మన్ తంగాళ్లపల్లి శ్రీవాణి రవికుమార్ తొలి బోనం సమర్పించి ప్రత్యేక పూజలు చేశారు. బోనాలు తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక అని పేర్కొంటూ పట్టణ ప్రజల సుఖ సంతోషాల కోసం ప్రత్యేక పూజలు చేశారు.