హైదరాబాద్: 28°C
వార్తలు

ఆక్రమణ తొలగింపులో ఇరిగేషన్ శాఖ ద్వంద వైఖరి

ELR: ఉంగుటూరు కాలువ గట్టుపై చిరు వ్యాపారుల ఆక్రమణలు తొలగించి, జాతీయ రహదారి దాకా కలప గుట్టలు వేసిన ధనిక టింబర్ వ్యాపారిని వదిలేయడం ఇరిగేషన్ శాఖ పక్షపాతానికి నిదర్శనం. చట్టం పేదలకు మాత్రమేనా, ధనవంతులకు వర్తించదా? ఈ వివక్ష వల్ల ప్రమాదాలు జరిగే ముప్పుంది. అధికారులు వెంటనే స్పందించి ఆ టింబర్ ఆక్రమణలను కూడా తొలగించి, అందరికీ సమాన న్యాయం చేయాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.