హైదరాబాద్: 28°C
వార్తలు

IIITలో సీటు సాధించిన విద్యార్థిని

PLD: రాజుపాలెం మండలంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల (కోట నెమలిపురి) విద్యార్థిని షేక్ సాదియా ట్రిపుల్ ఐటీ ఒంగోలులో సీటు సాధించింది. మార్చి 2026 ఎస్ఎస్‌సీ పరీక్షల్లో 600కు 570 మార్కులు సాధించిన ఈమె, బీసీ-బీ (దూదేకుల) కేటగిరిలో మూడో విడతలో ఎంపికైంది. ప్రతిభ చాటిన సాదియాను పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, గ్రామ పెద్దలు అభినందించారు.