KNR: చొప్పదండి మండలం కాట్నపల్లి వెంకటేశ్వరస్వామి ఆలయంలో గౌడ సంఘం ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. వర్షాభావ పరిస్థితులు తొలగి రైతులు సుభిక్షంగా ఉండాలని కోరుతూ స్వామివారికి జలాభిషేకం చేశారు. రాష్ట్రంలో సమృద్ధిగా వర్షాలు కురవాలని ప్రార్థించారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో వనభోజనాలు నిర్వహించగా మహిళలు బతుకమ్మ ఆడి సందడి చేశారు.
వార్తలు
వర్షాల కోసం స్వామివారికి జలాభిషేకం


