హైదరాబాద్: 28°C
వార్తలు

అరసం పాటల కార్యశాలకు విశేష స్పందన

PPM: అభ్యుదయ రచయితల సంఘం (అరసం) మన్యం జిల్లా ఆధ్వర్యంలో ఆదివారం జీజే కళాశాల ఆవరణలోని మన్యం కళావేదికలో పాటల కార్యశాల నిర్వహించారు. పార్వతీపురం అరసం అధ్యక్షుడు సిరికి స్వామినాయుడు అధ్యక్షతన జరిగిన కార్యక్రమానికి రచయితలు, గాయకులు, సాహితీ ప్రేమికులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. జిల్లా కోశాధికారి రామలింగస్వామి స్వాగతం పలికి అరసం లక్ష్యాలను వివరించారు.