హైదరాబాద్: 28°C
వార్తలు

'వాంగ్‌చుక్‌ను ఆసుపత్రికి తరలించడం సరైందే'

పర్యావరణ కార్యకర్త సోనమ్ వాంగ్‌చుక్ ఆరోగ్యం క్షీణించిన నేపథ్యంలో, ఆయన్ను సఫ్దర్‌జంగ్ ఆసుపత్రికి తరలించడం ఏకపక్షమైన నిర్ణయం కాదని దిల్లీ హైకోర్టు పేర్కొంది. ప్రభుత్వ తీసుకున్న నిర్ణయాన్ని సమర్థించింది. వాంగ్‌చుక్‌ను నిర్బంధించారన్న వాదనను న్యాయస్థానం తోసిపుచ్చింది. ఆయన స్వేచ్ఛగానే ఉన్నారని..ఆసుపత్రిలోని వైద్యులు ఆయన సమ్మతితోనే చికిత్స చేశారని పేర్కొంది.