హైదరాబాద్: 28°C
వార్తలు

తాగునీటి సమస్యను పరిష్కరించిన సర్పంచ్

KMR: బాన్సువాడ మండలం పోచారంలో పలు కాలనీలో తాగునీటి సమస్యను పరిష్కరించారు. పాడైపోయిన హ్యాండ్ బోర్‌ను మరమ్మతు చేయించి సర్పంచ్ రమేశ్, ఉప సర్పంచ్ లతీఫ్ తాగునీటి సమస్యకు పరిష్కారం చూపారు. ప్రజలకు తాగునీటి సౌకర్యం కల్పించేందుకు అవసరమైన మరమ్మతులు కొనసాగిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో రాములు, సాయిరాం, నరేష్ గౌడ్, మోహన్, రవి, ధరంసింగ్ పాల్గొన్నారు.