హైదరాబాద్: 28°C
వార్తలు

ఈనెల 21న సుదర్శన స్వామివారి తిరునక్షత్ర మహోత్సవం

WNP: శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవస్థానంలో ఈనెల 21న శ్రీ సుదర్శన అళ్వార్ తిరునక్షత్ర మహోత్సవం నిర్వహించనున్నారు. ఉదయం 9 గంటలకు శ్రీ సుదర్శన నరసింహ పెరుమాళ్ అభిషేకం, శ్రీ సుదర్శన నరసింహ మహాహోమం, అత్యంత వైభవంగా నిర్వహిస్తామని ఆలయ ఛైర్మన్ అయ్యలూరి రఘూనాథచార్యులు తెలిపారు. ఈ క్రతువులో పాల్గొనే భక్తులకు తీర్థ ప్రసాద గోష్టి, హోమ ప్రసాదం వితరణ చేస్తామన్నారు.