జమ్మూకశ్మీర్‌లో కురిసిన భారీ వర్షాలకు రాజౌరీ, పూంచ్ జిల్లాల్లో మెరుపు వరదలు సంభవించి బీభత్సం సృష్టించాయి. నదులు పొంగిపొర్లడంతో రాజౌరీలోని కొత్త బస్టాండ్ పూర్తిగా నీటమునిగింది. ఈ వరదల ధాటికి పలువురు మృతి చెందగా, మరికొందరు తీవ్రంగా గాయపడినట్లు సమాచారం. భారీగా ఆస్తి, వాహన నష్టం సంభవించడంతో అధికారులు సహాయక చర్యలు ముమ్మరం చేశారు.
వార్తలు
జమ్మూకశ్మీర్‌లో వరద బీభత్సం


