హైదరాబాద్: 28°C
వార్తలు

ఒళ్లు గగుర్పొడిచే వీడియో.. బాలుడిని తినేసి మొసలి

ఉత్తరప్రదేశ్‌లోని బహ్రైచ్ జిల్లాలో దారుణమైన ఘటన చోటుచేసుకుంది. వ్యవసాయ పనుల ముగించుకుని, నదిలో కాళ్లు, చేతులు కడుక్కోవడానికి వెళ్లిన సునీల్ (12) అనే బాలుడిని మొసలి నీటిలోకి లాక్కెళ్లి చంపేసింది. కుటుంబ సభ్యులు కాపాడే ప్రయత్నం చేసినా ఫలితం లేకపోయింది. అనంతరం అధికారులు ఆ మొసలి కడుపు చీల్చి బాలుడి మృతదేహాన్ని వెలికితీశారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది.