హైదరాబాద్: 28°C
వార్తలు

శరవేగంగా పాపంపల్లి బీటీ రోడ్డు పనులు

ATP: ఆత్మకూరు మండలం పాపంపల్లి గ్రామం నుంచి ప్రధాన రహదారికి వెళ్లే బీటీ రోడ్డు పనులు శరవేగంగా జరుగుతున్నాయి. దశాబ్దాలుగా రోడ్డు సౌకర్యం లేక ప్రజలు పడుతున్న ఇబ్బందులను గమనించిన ఎమ్మెల్యే పరిటాల సునీత ఎన్నికల హామీ మేరకు రూ.50 లక్షలతో ఈ రోడ్డు మంజూరు చేయించారు. దశాబ్దాల కలను నెరవేరుస్తున్నందుకు గ్రామస్థులు కూటమి ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు.