హైదరాబాద్: 28°C
వార్తలు

స్వచ్ఛత బాటలో కూచారం యువత

MDK: మనోహరాబాద్ మండలం కూచారం గ్రామంలో స్థానిక యువత ఆధ్వర్యంలో స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని ఆదివారం ఉత్సాహంగా నిర్వహించారు. గ్రామంలోని వీధులను శుభ్రం చేసి, ప్లాస్టిక్ రహిత గ్రామం కోసం ప్రజల్లో అవగాహన కల్పించారు. పరిసరాల పరిశుభ్రతపై ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని కోరారు. ఈ సామాజిక కార్యక్రమంలో గ్రామ యువకులు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.